గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌ ను ఇన్ స్టాల్ చేస్తున్నారా.. జాగ్రత్త

గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌ ను ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నెట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ (సీఆర్ టీ-ఇన్)వినియోగదారులకు సూచించింది. యూజర్లు డేటాను సేకరిస్తున్నారని తెలిసిన తరువాత 100 హానికరమైన గూగుల్ ఎక్స్‌టెన్షన్లను తొలగించినట్లు తెలిపింది. సైబర్ భద్రత వ్యవహారాలు చూసుకునే మంత్రిత్వ శాఖ సీఆర్ టీ-ఇన్ ఈ విషయాలను తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కచ్చితంగా అవసరమైన ఎక్స్ టెన్షన్స్ మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలి అని సూచించింది. ఈ ఏడాది జనవరిలో సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య  గణనీయంగా పెరిగిన  నేపథ్యంలో గూగుల్ అన్ని కమర్షియల్ ఎక్స్‌టెన్షన్లను నిలిపివేసింది.

Recommended For You