ట్రంప్ విషయంలో ఇరాన్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఇంటర్ పోల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ షాక్ తగిలింది. ట్రంప్ కు రెడ్ నోటీస్ జారీ చేయాలని ఇరాన్ ప్రభుత్వం.. ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. అయితే, ఇంటర్ పోల్ ఇరాన్ అభ్యర్థనకు ససేమీరా అన్నది. ఇరాన్ జనరల్ ఖాసీం సోలేమానీను అమెరికా డ్రోన్ దాడి చేసి చంపడంతో.. ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ తో సహా మరో 35 మందిపై కేసు పెట్టింది. ట్రంప్ పదవీకాలం పూర్తైన వెంటనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కు రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరింది. అయితే, రాజకీయ సంబందిత వ్యవహారాల్లో తాము కలుగుజేసుకోమని.. అది తమ విధి కాదని ఇంటర్ పోల్ తెలిపింది. ఇప్పటికే.. ఇరాన్ ట్రంప్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Recommended For You