అప్పుడు నోట్ల రద్దు.. ఇప్పడు టిక్‌టాక్: నుస్రత్ జహాన్

అప్పుడు నోట్ల రద్దు.. ఇప్పడు టిక్‌టాక్: నుస్రత్ జహాన్

ప్రభుత్వం తొందరపాటు చర్యకు అద్దం పడుతోంది టిక్‌టాక్ యాప్‌పై నిషేధం అని పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ విమర్శించారు. ఈ మధ్యాహ్నం కోల్ కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ రథయాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిక్‌టాక్ నిషేధ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక వర్గం ప్రజలు సమర్ధించినా.. నిషేధం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఈ నిషేధంవల్ల దేశంలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి కేంద్రం దగ్గరున్న వ్యూహాత్మక ప్రణాళిక ఏమిటి.. ఒకప్పుడు నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడినట్లే.. ఇప్పుడు టిక్‌టాక్ నిషేధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి నిషేధంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే టిక్‌టాక్ ని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను అని నుస్రత్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story