హాంకాంగ్ విషయంలో చైనాకు వ్యతిరేక గళం వినిపిస్తున్న భారత్

హాంకాంగ్ విషయంలో చైనాకు వ్యతిరేక గళం వినిపిస్తున్న భారత్

గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘటన తరువాత.. కేంద్ర ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి వరుసగా జలక్ లు ఇస్తుంది. ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించిన భారత్.. తాజాగా హాంకాంగ్ విషయాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. హాంకాంగ్ ప్రజల హక్కులను కాలరాసే విధంగా భద్రతా చట్టం బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వస్తే.. హాంకాంగ్ ప్రజలు నిరసనలు తెలియజేసేందుకు వీల్లేకుండా చైనా చర్యలు తీసుకోనుంది. అయితే, ఈ విషయంపై స్పందించిన భారత్.. ఐక్యరాజ్యసమితి సమావేశంలో.. హాంకాంగ్ విషయంలో చైనా అవలంభిస్తున్న వైఖరిని తాము పరిశీలిస్తున్నామని తెలిపింది. దీంతో.. చైనాపై ముప్పేట దాడికి తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు భారత్ ఇచ్చింది. అయితే, హాంకాంగ్ విషయంలో ఇప్పటి వరకూ స్పందించని భారత్.. గల్వాన్ ఘటన తరువాత ఈ విధంగా స్పందించడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story