గణపతి బప్పా మోరియా.. నీ ఎత్తు తగ్గిపోయిందయా..

గణపతి బప్పా మోరియా.. నీ ఎత్తు తగ్గిపోయిందయా..

హైదరాబాద్ వాసులకు అత్యంత ఇష్టమైన పండుగ వినాయకచవితి. గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఖైరతాబాద్ లో కొలువుదీరిన వినాయకుడిని సందర్శించడానికి భక్తులు బారులు తీరేవారు. కానీ ఈ ఏడాది కరోనా ప్రభావంతో పండుగలన్నీ నామ మాత్రంగా జరుపుతున్నారు. గత ఏడాది 63 అడుగుల విగ్రహాన్ని స్థాపించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ సారి విగ్రహం ఎత్తు 27 అడుగులతో సరిపుచ్చుతోంది. అది కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుతూ తమ భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నారు. స్థానికులకు ఆరడుగుల దూరం నుంచి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లోని భక్తులకు ఆన్ లైన్ లో దర్శనం కల్పించాలని ఉత్పవ కమిటీ భావిస్తోంది. ఇక విగ్రహం తయారీ కోసం హైదరాబాద్ సిటీ కమిషనర్ ను సంప్రదించి అనుమతి తీసుకుంటామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story