దేశవ్యాప్తంగా ఒక్కరోజే 20,903 మందికి కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 20,903 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజులో 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,25,544కు చేరింది. ప్రాణాంతకర వైరస్ కారణంగా తాజాగా 379 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 18,213కు చేరింది.

శుక్రవారం నాటికి కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న రోగులు 60.73% దాటారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటివరకు కరోనా బారినుండి మొత్తం 3,79,891 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్సనందించడం వల్లే కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story