ఆ ఆరు నగరాల నుంచి కోల్‌కతాకు విమాన సర్వీసులు రద్దు..

ఆ ఆరు నగరాల నుంచి కోల్‌కతాకు విమాన సర్వీసులు రద్దు..

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేటట్లు కనిపించట్లేదు. వైరస్ వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్ పోర్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, పూణె, చెన్నై, అహ్మదాబాద్, నాగపూర్ ప్రాంతాల నుంచి కోల్‌కతాకు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 6 నుంచి 19 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకే ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story