ఆన్‌లైన్‌లో నవగ్రహపూజ, గణపతి హోమం

ఆన్‌లైన్‌లో నవగ్రహపూజ, గణపతి హోమం

ప్రపంచదేశాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ కరోనా విలయం.. నవీన ఆచారాలను మానవాళి ముందుకు తెచ్చింది. కరోనా కారణంగా ఇంటిలోనే ఉండి.. ఆన్‌లైన్ ద్వార పూజలు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ ద్వారా తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతోంది.

ఇటీవల చాలా గుడులలో పూజలు ఆన్‌లైన్‌ సేవల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇంటర్ నెట్, మొబైల్‌ ఫోన్ ద్వారా లాగ్ ఆన్‌ అయి, దేవుళ్ళకు పూజలు చేయిస్తున్నారు. శుభకార్యాలు కూడా ఇలాగే జరుగుతున్నాయి. పెండ్లిండ్లు కేవలం నలుగురు బంధువులతో ఇంట్లో చేయించడం జరిగుతోంది. ఇక ఇతర బంధుగణమంతా ఆన్‌లైన్‌లో పెండ్లిని లైవ్‌గా చూస్తున్నారు. ఫోన్ ద్వారా లైవ్ వీడియో అందరికీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. అన్ని అన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌‌లో ఇలాంటి ఘటనే జరిగింది.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు వృత్తి రీత్యా కెనడాలో నివాసం ఉంటున్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌కు వచ్చి పూజలు చేయించే వారు. కరోనా కారణంగా ఈసారి కెనడా నుంచి రాలేక పోయారు. దీంతో వారు కోరిన విధంగా ఆదిలాబాద్‌లోని బ్రాహ్మణ వాడలో గల ఆలయంలో రుత్వికులు జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం నవగ్రహపూజ, గణపతి హోమం, మహా రుద్రాభిషేకం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story