భారత్‌లో కరోనా.. కోటి దాటిన కొవిడ్ టెస్టులు

భారత్‌లో కరోనా.. కోటి దాటిన కొవిడ్ టెస్టులు

భారత్‌లో కరోనా టెస్టులు కోటి మార్కును దాటింది. ఇప్పటివరకూ 1,00,04,101 టెస్టులు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1105 ల్యాబ్స్ లో టెస్టులు జరిగినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి మొదలైన ఫిబ్రవరి మొదటివారంలో దేశంలో 13 ల్యాబ్ లు ఉండగా.. మార్చి 24 నాటికి అవి 123 ల్యాబ్ లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 11 వందలకు చేరడంతో కోటి టెస్టులు చేయడం సాద్యం అయింది. ఇందులో 788 ల్యాబ్ లు ప్రభుత్వానివి కాగా.. 317 ల్యాబ్ లు ప్రైవేట్ వని ఐసీఎంఆర్ తెలిపింది. గడిచిన 14 రోజుల్లో రోజుకు సగటున 2.15 లక్షల టెస్టులు జరిగాయి. ప్రస్తుతం దేశంలో 3.5 లక్షల టెస్టులు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. కాగా.. దేశంలో ఇప్పటివరకూ ఇప్పటివరకు 6,97,413 మంది కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది.

Tags

Read MoreRead Less
Next Story