కొవిడ్ ఎక్కువగా ఉంది.. ఎవరూ రావొద్దు: చార్మినార్, గోల్కొండ క్లోజ్

కొవిడ్ ఎక్కువగా ఉంది.. ఎవరూ రావొద్దు: చార్మినార్, గోల్కొండ క్లోజ్

మూడు నెలలు దాటిపోయింది సినిమా ముచ్చట లేదు.. పార్క్ పక్కకి కూడా వెళ్లట్లేదు. అనుమతిచ్చారు కదా అని గోల్కొండ కోటని ఎక్కుదామనుకుంటే అంతలోనే ఆ ఏరియాలో కేసులు ఎక్కువగా ఉన్నాయని రెండు రోజులు తెరిచి వెంటనే మూసివేశారు. ఈ నెలాఖరు వరకు కోటలోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. చార్మినార్, గోల్కొండ కట్టడాలను ఈ నెల 31 వరకు మూసి వుంచుతారు. పర్యాటకులు ఎవరూ రావొద్దని కోట సహాయ నిర్వహణ అధికారి ఎమ్. నవీన్ కుమార్ తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కోటలోకి సందర్శకుల అనుమతి రద్దు చేశామని తెలిపారు. వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకున్నవారు రెండు రోజుల్లో 64 మంది గోల్కొండ కోటను సందర్శించినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story