రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ పై విచారణకు హోమ్ శాఖ ఆదేశం

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ పై విచారణకు హోమ్ శాఖ ఆదేశం

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్, అలాగే ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లకు నిధులు రావడంపై కేంద్ర హోం శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈ ట్రస్టులపై విచారణ జరపడం కోసం.. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వం వహిస్తారని హోమ్ శాఖ పేర్కొంది. ఈ రెండు ట్రస్టులు విరాళాల సేకరణలో నిబంధనలు ఉల్లంగించాయో లేదో మినిస్టీరియల్ కమిటీ తేల్చనుంది. కాగా ఇటీవల రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కుచైనా రాయబార కార్యాలయం భారీ ఎత్తున విరాళాలు అందినట్లు బిజెపి ఆరోపించిన సంగతి తెలిసిందే.

రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ మరియు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ లు మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయపు పన్ను నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సరిహద్దులో చైనాతో ఏర్పడిన వివాదాన్ని కప్పిపుచ్చేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రతివిమర్శ చేశారు. ఈ నేపథ్యంలో ట్రస్టుల విరాళాలపై విచారణకు హోమ్ శాఖ ఆదేశాలు ఇవ్వడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story