కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ కొత్త వాదన

కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ కొత్త వాదన

పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న భారత పౌరుడు కుల్ భూషణ్ జాదవ్‌పై పాకిస్తాన్ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. తన ఉరిశిక్షకు వ్యతిరేకంగా సమీక్ష పిటిషన్ దాఖలు చేయడానికి కులభూషణ్ జాదవ్ నిరాకరించారని వాదనలో పేర్కొంది. కుల్ భూషణ్ జాదవ్ తన క్షమాబిక్ష పిటిషన్ కు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్టు పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం, పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ అహ్మద్ ఇర్ఫాన్ బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వాదన వెలియబుచ్చారు. గత జూలైలో, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) పాకిస్తాన్‌ను జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని, అతని మరణశిక్షను సమీక్షించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సమీక్ష పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేయవచ్చు అని ఇర్ఫాన్ చెప్పారు, స్వయంగా జాదవ్ లేదంటే ఆయన ప్రతినిధి అదీ కుదరకపోతే భారత హైకమిషన్ కాన్సులర్ అధికారి దాఖలు చేయవచ్చని తెలిపారు. జూన్ 17, 2020 న, కుల్ భూషణ్ జాదవ్ తన ఉరిశిక్షపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయమని కోరినప్పటికీ.. పిటిషన్ దాఖలు చేయడానికి నిరాకరించాడని.. అంతేకాదు దీనికి బదులుగా పెండింగ్ లో ఉన్న క్షమాబిక్ష పిటిషన్ కు కట్టుబడి ఉండాలని జాదవ్ నిర్ణయించుకున్నట్టు ఇర్ఫాన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story