వివాహాల‌కు 50 మందికి మాత్ర‌మే అనుమ‌తి

వివాహాల‌కు 50 మందికి మాత్ర‌మే అనుమ‌తి

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఒడిశాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌ల‌కు పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు ముందే పోలీసుల అనుమ‌తి తీసుకోవాల‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం సూచించింది. వివాహాల‌కు 50 మంది, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇస్తామ‌ని సర్కార్ స్ప‌ష్టం చేసింది. పోలీసుల‌కు నేరుగా లేదా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని అధికారులు తెలిపారు.

కాగా, ఒడిశాలో ఇప్ప‌టి వ‌ర‌కు 10,624 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 61 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 3,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వైర‌స్ నుంచి 7,006 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story