కరోనా వైద్యం : ఫీజులను నిర్ధారించిన ఏపీ

కరోనా వైద్యం : ఫీజులను నిర్ధారించిన ఏపీ

కరోనా సోకిన రోగులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేసే చికిత్స కోసం ఫీజులను నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి రూ. 3,250 గా నిర్ణయించింది. క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ.5,480 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌ఐవీతోపాటు ఐసీయూలో ఉంచితే రోజుకి రూ. 5,980 గా నిర్ణయించారు. వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం అందిస్తే రోజుకి రూ. 9,580 చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉండి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా చెల్లించాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ ద్వారా వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story