తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై నటి..

తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై నటి..

కన్నడ నటే అయినా వివిధ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నటి జయంతి. ఆమె గత 35 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు కొవిడ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు వైద్య సిబ్బంది. అయితే కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న కారణంగా జయింతిని చూసేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలో కోలుకుంటారని కుమారుడు కృష్ణ కుమార్ తెలిపారు. కాగా 1963లో జెను గూడు అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన జయంతి హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళ, మరాఠీ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించారు. 300 సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలక్షణమైన నటిగా గుర్తింపు పొందారు. ఈ మధ్య కాలంలో విడుదలైన చిరంజీవి చిత్రం సైరా నర్సింహారెడ్డి చిత్రంలో కూడా జయంతి నటించి మెప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story