భారతదేశంపై అభిమానంతో బ్రిటన్ హై కమిషనర్ తన కూతురికి పెట్టుకున్న పేరు..

భారతదేశంపై అభిమానంతో బ్రిటన్ హై కమిషనర్ తన కూతురికి పెట్టుకున్న పేరు..

ఈ దేశ పౌరులమైనందుకు, భారతీయులమైనందుకు మనమెంతో గర్వించాలి. మన దేశం పేరుని మరో దేశ దౌత్య వేత్త తన కూతురికి పెట్టుకున్నారు. భారత్ లో బ్రిటన్ హై కమిషనర్ గా సర్ ఫిలిప్ బార్టన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, బ్రిటన్ ప్రజల మధ్య సంబంధాలు ఇరు దేశాలకు ప్రయోజనాన్ని చేకూర్చేవిగా ఉంటాయని తెలిపారు. అద్భుతమైన భారతదేశంలో బ్రిటన్ కు ప్రాతినిధ్యం వహించడం తన దౌత్య వృత్తికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ గొప్ప పనికి తాను వారధిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన తల్లి భారతీయురాలని, తాను సిమ్లాలో జన్మించానని చెప్పారు. గతంలో భారత్ లో విధులు నిర్వహించినప్పుడు తన భార్యతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసిందని అన్నారు. భారతదేశంపై ఉన్న ప్రేమాభినాలతో తమకు పుట్టిన బిడ్డకు 'ఇండియా' అని పేరు పెట్టుకున్నట్లు వివరించారు.

బ్రిటన్ తో పాటు న్యూజిలాండ్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు బుధవారం ఢిల్లీలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో వారి గౌరవ వందనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వీకరించారు. కరోనా నేపథ్యంలో చాలా వరకు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధినేతలు.

Tags

Read MoreRead Less
Next Story