వారణాసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్

వారణాసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా కష్టకాలంలో వివిధ సంస్థలు చేసిన సామాజిక పనులపట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయం చెయ్యడానికి ముందుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరోనాను నియంత్రించడానికి ఉత్తప్రదేశ్ లో యోగి ప్రభుత్వం బాగా కృషి చేసిందని ప్రశంసించారు. ఈ సందర్బంగా కరోనా కాలంలో ప్రజల సహాయార్ధం కేంద్రం తీసుకున్న చర్యలను వారికి వివరించారు.

వంద సంవత్సరాల కిందట కూడా ఇటువంటి భయంకరమైన అంటువ్యాధి వచ్చిందని. అప్పుడు భారతదేశంలో ఇంతమంది జనాభా లేరని.. కానీ ఆ సమయంలో కూడా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయన్న మోదీ.. ప్రజల సహకారం అన్ని భయాలను దూరం చేసిందని అన్నారు. కరోనా కాలంలో దేశంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నామని అన్నారు. కాశీ ప్రజలు కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story