బీఎస్ -4 వాహనాల అమ్మకానికి ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేసిన సుప్రీం

బీఎస్ -4 వాహనాల అమ్మకానికి ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేసిన సుప్రీం

బిఎస్-4 వాహనాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్చి 25 న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా కోల్పోయిన ఆరు రోజుల వరకు అమ్ముడుపోని బిఎస్-4 వాహనాలను

10 రోజులలోపు విక్రయించడానికి అనుమతి ఇస్తూ మార్చి 27 న సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను రీకాల్ చేసింది. ఆటోమొబైల్ డీలర్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, మార్చి చివరి వారంలో అలాగే మార్చి 31 తర్వాత కూడా లాక్డౌన్ సమయంలో బిఎస్-4 వాహనాలను విక్రయించారని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎస్‌ఐ నజీర్, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్ణయాన్ని వెల్లడించింది. మార్చి 31 తర్వాత వాహనాల అమ్మకం ఎలా జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. మార్చి 31 తర్వాత ఈ-వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన వాహనాల డేటాను తన ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం. అలాగే 31 మార్చి 2020 తర్వాత బీఎస్ -4 వాహనాన్ని విక్రయిస్తే నమోదు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story