ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్కు జాతికి అంకితం

ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్కు జాతికి అంకితం

మధ్యప్రదేశ్‌లోని రెవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును నెలకొల్పింది. దీనిద్వారా 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ఆసియాలో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ ప్రాజెక్టుతో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ కూడా‌ నిలిచిందని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైడ్ సోలార్ ప్లాంట్లలో ఒకటి. ఈ సౌర విద్యుత్ ప్లాంట్‌లో మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story