షూటింగ్స్ లో పాల్గొనే వారందరికీ..

షూటింగ్స్ లో పాల్గొనే వారందరికీ..

దాదాపు నాలుగు నెలలు కావస్తోంది సినిమా షూటింగ్ లు జరిగి. ఇప్పుడైనా మొదలు పెడదామంటే కరోనా భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. మాస్కులు పెట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్స్ చేయడమంటే సాధ్యమయ్యే పనేనా.. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకుంటామంటే అది మనకు మనం అబద్దం చెప్పుకోవడమే అవుతుంది అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా. షూటింగ్స్ ప్రారంభించడానికి తానేం తొందరపట్లేదన్నారు. ఒకవేళ మొదలు పెట్టినా ఇది వరకు షూటింగ్స్ కు పెట్టే ఖర్చు కన్నా ఇప్పుడు 20 శాతం ఎక్కువ ఖర్చవుతుంది.

ఎందుకుంటే షూటింగ్స్ లో పాల్గొనేవారందరికీ కరోనా నుంచి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. భౌతిక దూరం పాటించడం అనేది జరగదు.. జరగబోదు.. అని అనుభవ్ అన్నారు. కాగా, తుమ్ బిన్ 1&2, దస్, రా.వన్, ముల్క్, ఆర్టికల్ 15 వంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు అనుభవ్ సిన్హా. ఈ ఏడాది వచ్చిన 'తప్పడ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయుష్మాన్ ఖురానాతో మరో చిత్రాన్ని తీసేందుకు అనుభవ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందు విదేశాల్లో షూట్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం భారత్ లోనే చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story