ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. మార్చిలో జరిగిన సెకండియర్‌ పరీక్షల్లో ఫెయిలయిన వారందరినీ పాస్‌ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తీర్ణులైన వారందరూ కంపార్ట్‌మెంట్‌లో పాస్‌ అయినట్లుగా మార్కుల మెమోలో పేర్కొంటామని తెలిపారు. ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులు పాస్ కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story