ఒకే కుటుంబంలోని 9 మందికి..

ఒకే కుటుంబంలోని 9 మందికి..

కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా వస్తే.. జాగ్రత్తలు పాటించకపోయినా, ఆ వ్యక్తికి కరోనా వచ్చిన విషయం తెలియకపోయినా కుటుంబంలోని మిగతా సభ్యులతో పాటు మరి కొంత మంది కరోనా బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్ నారాయణపేట్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి కరోనా సోకింది. రెండ్రోజుల కిందట పట్టణంలోని ఆర్ఎంపీ డాక్టర్ కి కరోనా సోకడంతో ఆయనకు కలిసిన వ్యక్తులను పరీక్షించడా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగరల్ జిల్లాలో 8 మంది, నాగర్ కర్నూలులో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. మహబూబ్ నగర్ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. జడ్చర్లలోని యువకుడికి, గద్వాలలోని కిరాణా వ్యాపారికి, నాగర్ కర్నూలులో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన వ్యక్తికి, కొల్లాపూర్ లోని ఆర్ఎంపీ వైద్యుడి భార్యకు, బిజినేపల్లి మండలంలోని లింగసాని పల్లికి చెందిన ఓ పోలీసు ఉద్యోగికి కరోనా వచ్చింది. కాగా పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు 367 పాజిటివ్ కేసులు నమాదు కాగా.. 25 మంది కొవిడ్ తో మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story