భారత్‌కు ట్రంప్ అండగా ఉంటారనేది అనుమానమే: జాన్ బోల్టన్

భారత్‌కు ట్రంప్ అండగా ఉంటారనేది అనుమానమే: జాన్ బోల్టన్

భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య వివాధం మరింత ముదిరితే.. ట్రంప్ భారత్ కు అండగా ఉంటారనే నమ్మకం లేదని ఆయన అన్నారు. చైనా.. జపాన్, భారత్ తో సరిహద్దు విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తుందని అన్నారు. వియాన్ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

అయితే, భారత్ చైనాల మధ్య వివాదం ముదిరితే ట్రంప్ వైఖరి ఎలా ఉంటుదనే ప్రశ్నకు.. ఆ విషయంలో ట్రంప్ స్టాండ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని.. నిజానికి ట్రంప్ కూడా ఆ విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియదని తాను అనుకుంటున్న అని జాన్ బోల్టన్ అన్నారు. చైనాతో వాణిజ్య సంబంధాలు బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉండటంతో ఆయన ఎలా వ్యవహరిస్తారో తెలియదని అన్నారు. ఇరు దేశాల సరిహద్దులపై ట్రంప్ కు అవగాహన లేదని.. నవంబర్ లో జరగనున్న ఎన్నికల వరకూ ఈ వివాదం ముదరకుండా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారని అన్నారు. వివాదంలో ఏ స్టాండ్ తీసుకుంటే.. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని జాన్ బోల్టన్ అన్నారు. కాబట్టి, చైనాతో సరిహద్దు వివాదంలో భారత్ కు ట్రంప్ సపోర్టు చేస్తారనేది అనుమానమే అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story