బిల్లు 43 డాలర్లు.. టిప్ వెయ్యి డాలర్లు

బిల్లు 43 డాలర్లు.. టిప్ వెయ్యి డాలర్లు

కరోనా కష్టాల్లో పని దొరకడమే కష్టంగా ఉంది. అటువంటిది జీతాలు, టిప్ లు గురించి అసలు ఆలోచించడానికి లేదు. కానీ, ఇలాంటి సమయంలో ఏకంగా 70 వేలు టిప్ దక్కిందంటే.. ఆ వెయింటర్ పంట పండినట్టే. ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు అటు సిబ్బంది, ఇటు కస్టమర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు సడలించండతో ఓ రెస్టారెంట్ ఓ కస్టమర్ తన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. ఆయన అక్కడికి రెగ్యూలర్ కస్టమర్ కావడంతో ఆ వెయిటర్ కు భారీగా టిప్ ఇచ్చాడు. రెస్టారెంట్ కు 43 డాలర్లు బిల్లు చెల్లించగా.. టిప్ ఏకంగా వెయ్యి డాల్లరు చెల్లించాడు. దీంతో ఆ వెయిటర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Tags

Read MoreRead Less
Next Story