భార్య వద్దన్నా వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొని..

భార్య వద్దన్నా వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొని..

తప్పదు.. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి.. కానీ ధైర్యంగా ముందడుగు వేసేది ఎవరు. ట్రయిల్స్ సక్సెస్ అయితే తన ప్రాణంతో పాటు కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. అదే ఫెయిల్ అయితే.. ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ప్రమాదకర ప్రయోగంలో భాగస్వాములు కావాలంటే గుండె ధైర్యం కావాలి. భారత సంతతికి చెందిన దీపక్ పళివాల్ రాజస్థాన్ లోని జైపూర్ వాసి. లండ‌న్‌లో ఆయన కుటుంబం స్థిరపడింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతోంది.

ఈ నేపథ్యంలో దీపక్.. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్శిటీ నిర్వహించే వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల గురించి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ ట్రయిల్స్ లో పాల్గొనే వారు స్వచ్ఛందంగా ముందుకు రావలసిందిగా కోరిన విజ్ఞప్తిని స్వీకరించారు. కొన్ని వందల మందిపై చేస్తున్న ప్రయోగాల్లో ఆయన కూడా భాగస్వాములయ్యారు. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 16న దీని గురించి తెలుసుకున్నా.. ఏప్రిల్ 26న లండన్ లో దీనికి సంబంధించిన కేంద్రాన్ని సందర్శించాను.. అనంతరం ట్రయల్స్ లో పాల్గొనాలనుకుంటున్న నా నిర్ణయాన్ని స్నేహితులకు, భార్యకు చెప్పాను.

కానీ నా భార్య దీన్ని తీవ్రంగా ఖండించింది. అయినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. నా మెదడు వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు కానీ, నా శరీరం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనుకున్నా. అందుకే మరో ఆలోచన లేకుండా ట్రయల్స్ లో పాల్గొన్నానని తెలిపాడు. హ్యూమన్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినావెనుకడుగు వేయలేదు. ఒక్కోసారి అవయవాలు దెబ్బతినవచ్చు.. ప్రాణాలూ పోవచ్చు.

అయినా కరోనా కట్టడికి తన వంతు సాయం చేయాలనుకున్న దృఢ సంకల్పమే తనని ముందడుగు వేయనిచ్చింది. చెరగని ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలతో ట్రయల్స్ లో పాల్గొని క్షేమంగా ఇంటికి తిరిగివచ్చారు దీపక్. దాంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Tags

Read MoreRead Less
Next Story