బన్నీ.. ప్లీజ్ ఒక్క ఛాన్స్

బన్నీ.. ప్లీజ్ ఒక్క ఛాన్స్

'అల వైకుంఠపురములో' చిత్రం అందర్నీ ఆకర్షించింది. ఇక ఆ చిత్రంలోని పాటలకి బాలీవుడ్ నటీనటులు కూడా ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే నెట్ ఫ్లిక్స్ లో ఆ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ గుప్తా వెంటనే బన్నీని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. బుల్లి తెరమీద ఈ చిత్రాన్ని వీక్షించాను. కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడ్డాక థియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూస్తా అని సంజయ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కి బన్నీ వెంటనే రిప్లై ఇచ్చారు. మీరు ఈ సినిమాను చూడడం ఆనందంగా ఉంది.. మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరో పోస్ట్ పెట్టిన సంజయ్.. బ్రదర్ మీ యాక్టింగ్ కి నేను ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు నన్ను నవ్వించారు.. ఏడిపించారు.. జీవితాంతం నేను మిమ్మల్ని అభిమానిస్తుంటాను. మీతో వర్క్ చేయడానికి ఒక్క అవకాశం ఇస్తారని ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు. కాగా సంజయ్ కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జబ్బా వంటి సినిమాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story