వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై‌ ఏక సభ్య స్వతంత్ర కమిషన్ దర్యాప్తు

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై‌ ఏక సభ్య స్వతంత్ర కమిషన్ దర్యాప్తు

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే మరణంపై ఏక సభ్య స్వతంత్ర కమిషన్ దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అయితే, శనివారం దూబే అంత దుర్మార్గంగా ఎలా ఎదిగాడన్న దానిపై విచారించాలని ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. అయితే, దూబే మరణానికి సంబంధించి దర్యాప్తు గురించి సిట్ కి అప్పగించలేదు. దూబే మరణంపై పోలీసులు చెబుతున్న దానికి.. వీడియోలు, సాక్షి చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో పోలీసులు ఇరకాటంలో పడుతున్నారు. వికాస్ దూబేను అరెస్టు చేసి కాన్పూర్ తీసుకెళ్లే మార్గంలో వాహనం బోల్తా పడిందని.. అక్కడ పోలీసుల పై కాల్పులు జరిపి వికాస్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. తాము ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే, వికాస్ దూబేను ఎందుకు కారులో తరలించాల్సి వచ్చింది? చేతికి ఎందుకు బేడీలు వేయలేదనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానాలు వెతకాలని ఏక సభ్య స్వతంత్ర కమిషన్ దర్యాప్తు చేపట్టనుంది

Tags

Read MoreRead Less
Next Story