రాజస్తాన్ లో రాజకీయ‌ సంక్షోభం : సింధియా ట్వీట్‌

రాజస్తాన్ లో రాజకీయ‌ సంక్షోభం : సింధియా ట్వీట్‌

మధ్యప్రదేశ్ లో చేజేతులా ప్రభుత్వాన్ని కూల్చివేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో టెన్షన్ మొదలయింది. రాజస్థాన్‌లో లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యవహారశైలిపట్ల అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 20 మంది దాకా ఎమ్మెల్యేలు జైపూర్ లోని హోటల్ లలో సమావేశం అయ్యారని ప్రచారం జరుగుతోంది. వారు ఏ క్షణమైనా బీజేపీ చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలెట్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో బిజెపికి ఫిరాయించిన జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనానికి దోహదపడ్డారు,

రాజస్థాన్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్.. ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను కావాలనే పక్కకు బెట్టి, ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తన మాజీ సహచరుడు సచిన్‌ను

ఈ పరిస్థితులలో చూడటం బాధాకరం అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story