ఐసోలేషన్ లో ఉండడం నావల్ల కావట్లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు

ఐసోలేషన్ లో ఉండడం నావల్ల కావట్లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు

బ్రెజిల్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు బోల్సోనారో సైతం కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నారు గత వారం రోజుల నుంచి. ఇక ఇక్కడ ఉండడం నావల్ల కావట్లేదు. మంగళవారం మళ్లీ టెస్ట్ చేస్తామన్నారు వైద్యులు. ఈసారి నెగిటివ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బావుందని జ్వరం, శ్వాసకోశ సమస్యలు లాంటివి లేవని అన్నారు. కొవిడ్ లక్షణాలలో ఒకటైన రుచిని కోల్పోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు సాగిస్తున్నాను అని 65 ఏళ్ల బోల్సోనారో అన్నారు. ప్రతి రోజు తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం తీసుకోవడం ప్రారంభించానని చెప్పారు. ఈ ఔషధం నాకు బాగా పని చేసింది. నేను బాగున్నాను. దేవునికి కృతజ్ఞతలు. ఒకవేళ ఎవరైనా ఈ ఔషధాన్ని విమర్శించినట్లైతే ప్రత్యామ్నాయాన్ని చూపించండి అని ఆయన ఫేస్ బుక్ లైవ్ లో వ్యాఖ్యానించారు. యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదైన దేశం బ్రెజిల్. సోమవారం నాటికి 1.8 మిలియన్ల కేసులలో 72,833 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story