శివగామితో పాటు దేవసేన, కట్టప్ప కూడా..

శివగామితో పాటు దేవసేన, కట్టప్ప కూడా..

దేనికైనా పెట్టి పుట్టాలంటారు.. అంటే ఇదేనేమో.. అదృష్టం ఒకర్ని వరించబోయి మరొకర్ని వరించింది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంలోని శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించినా ఆమె భారీ రెమ్యునరేషన్ కోరడంతో ఆ పాత్ర రమ్యకృష్ణను వెతుక్కుంటూ వెళ్లింది. ఆమె ఒకే చేయడం ఆ చిత్రానికి కలిసి వచ్చిన అదృష్టంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత బాగా నటించి మెప్పించారు రమ్య. అలాగే కట్టప్ప కోసం ముందు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని అనుకున్నారట. అది కాస్తా సత్యరాజ్ ని వరించింది. ఆయన ఆ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని అనడం బావుంటుందేమో. ఇక సినిమాలో మరో కీలక పాత్ర దేవసేన పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలనుకున్నారట. అయితే ఆమె డైరీలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి. దీంతో దేవసేన క్యారెక్టర్ అనుష్కను వరించింది. అందుకేనేమో ప్రేక్షకులు బాహుబలి చిత్రానికి నూటికి నూటయాభై మార్కులు వేశారు. అంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు నటీనటులు. ఆ చిత్రం రాజమౌళి అద్భుతసృష్టికి నిదర్శనంగా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story