సచిన్ పైలట్ స్థానంలో గోవింద్‌ సింగ్‌ కు పీసీసీ పగ్గాలు

సచిన్ పైలట్ స్థానంలో గోవింద్‌ సింగ్‌ కు పీసీసీ పగ్గాలు

రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. రెండోసారి కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీంతో సచిన్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల ప్రకటించారు. అంతేకాదు పైలట్ తోపాటు రాష్ట్ర ఆహార, పౌర సరఫరా మంత్రి రమేష్ మీనా, పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ ను కూడా తొలగించారు.

ఇక సచిన్‌ స్థానంలో రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా గోవింద్‌ సింగ్‌ ను నియమించింది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నియామకాన్ని రణదీప్ సింగ్ సుర్జేవాలా జైపూర్ లో ప్రకటించారు. అలాగే సచిన్ వర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముకేష్ భాకర్, సేవాదళ్ అధ్యక్షుడు రాకేశ్ పరీక్‌లను కూడా తొలగించింది. దుంగర్‌పూర్‌కు చెందిన ఎమ్మెల్యే గణేష్ ఘోఘ్రా, హేమ్ సింగ్ షేఖావత్‌లకు ఈ పోస్టులు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story