ఎంత తెలివి.. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం రవాణా ఎలా చేశాడో చూడండి

ఎంత తెలివి.. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం రవాణా ఎలా చేశాడో చూడండి

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మద్యం అక్రమ రవాణా చేసేందుకు కొందరు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి మూడు లక్షలు విలువైన మద్యాన్ని తరలిస్తూ.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద పట్టుబడ్డాడు. హైదరాబాద్ నుంచి వ్యానులో ఇంటి సామాను షిఫ్ట్ చేస్తున్నాడు. అయితే మద్యం అక్రమ తరలింపుపై ముమ్మర తనిఖీ చేస్తున్న పోలీసులు వ్యానులో సామాను చెక్ చేశారు. బీరువా ఫ్రిజ్ వాషింగ్ మిషన్ లో మూడు లక్షల విలువైన మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. మధయ్మ్ సీసాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తణుకుకు చెందిన వ్యక్తితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story