సీఎల్పీ సమావేశానికి దూరంగా సచిన్ పైలట్

సీఎల్పీ సమావేశానికి దూరంగా సచిన్ పైలట్

రాజస్థాన్ లోని రాజకీయ సమీకరణాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. జైపూర్ లో మరోసారి సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తిరుగుబాటు నేత డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు ఆహ్వానం పంపారు. అయితే, ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి 97 మంది హాజరైనట్టు తెలుస్తుంది. సోమవారం జరిగిన సమావేశానికి 106 మంది హాజరైయ్యారని.. మరో ఐదుగురు సంతకాలు చేసి లేఖలు కూడా పంపించారని అన్నారు. సచిన్ పైలట్ తనతో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సోమవారం ప్రకటించినా.. ఆయనతో కలిసి 20 మంది మాత్రమే సీఎల్పీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది.

గత రెండురోజులు జరిగిన రాజకీయ రచ్చతో.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారని.. దీంతో అంతా సర్దుమణిగిందని అంతా భావించారు. కానీ, బుధవారం సీఎల్పీ సమావేశానికి సచిన్ హాజరుకాకపోవడంతో ప్రియాంక గాంధీ చేసిన మంతనాల వలన ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని తెలుస్తుంది. సచిన్ పైలట్ తీరుపై కాంగ్రెస్ బాగా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో అవకాశం ఇచ్చి.. అయినప్పటికీ వినకపోతే.. ఆయనకు పార్టీ నుంచి బహిస్కరించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story