వికాస్‌ దుబే నెల సంపాదనెంతో తెలుసా?

వికాస్‌ దుబే నెల సంపాదనెంతో తెలుసా?

కాన్పూర్ లో అనుచరులతో కలిసి 8 మంది పోలీసులపై కాల్పులు జరిపిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఇటీవల ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే వికాస్ దూబే కేసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దుబే నెలకు కోటి రూపాయలు సంపాదించేవాడని అతని సోదరి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంత సంపాదించినా కూడా దుబే చాలా సాధారణమైన జీవితాన్ని గడిపాడట. ఎటువంటి చెడు అలవాట్లు లేని టీటోటలర్ అని.. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు పెద్దగా ఇష్టపడేవాడు కాదని ఈడీకి తెలిసింది. అంతేకాదు ఎప్పుడూ సాధారణ బట్టలు మాత్రమే ధరించాడు.. విదేశాలకు వెళ్లినా పెద్ద ఖర్చు చేసేవాడు కాదట..

దీంతో అతని బ్యాంక్ ఖాతాలలో కూడా తక్కువగానే డబ్బులు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో అతను సంపాదించిన డబ్బంతా ఏమైనట్టు అని అధికారులు ఆరా తీస్తున్నారు. దుబే సన్నిహితుల బ్యాంక్‌ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు దుబే అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏవైనా వ్యాపారాలు చేశారా అనే కోణంలో కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యాపారులను ఆరా తీస్తోంది ఈడీ.

Tags

Read MoreRead Less
Next Story