మాస్క్ పెట్టుకోలేదంటే.. 500 సార్లు..

మాస్క్ పెట్టుకోలేదంటే.. 500 సార్లు..

కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలని ప్రభుత్వాలు మొత్తుకున్నా పెడచెవిన పెట్టే వారు ఇంకా కొందరు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఎలా చెబితే వింటారు.. ఏం పనిష్మెంట్ ఇస్తే వీళ్లకి బుద్ధి వస్తుంది అని అధికారులు తెగ ఆలోచించారు. ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. టైమెంతో విలువైంది.. జీవితం మరింత విలువైంది.. అందుకే మాస్క్ పెట్టుకోని వారిని ఓ మూడు గంటలు కూర్చోబెట్టి 500 సార్లు నేను మాస్క్ పెట్టుకుంటాను అని రాయించాలని డిసైడ్ అయ్యారు యూపీ అధికారులు.

రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుంటే కొంచెం కూడా భయంలేకుండా ప్రవర్తిస్తున్న వారిని చూసి అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మాస్క్ లేని వ్యక్తిని లాక్కొచ్చి ఓ గదిలో కూర్చోబెడతారు.. ఓ వీడియో ప్లే చేస్తారు. అందులో మాస్క్ వల్ల ఉపయోగాలు చూపిస్తారు. ఆ తరువాత 500 సార్లు రాయమంటారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేసరికి మూడు గంటలు పడుతుంది. అసలే టైమ్ అయిపోతుందని మాస్క్ మరిచిపోయిన వ్యక్తికి ఇది ఓ గొప్ప పనిష్మెంట్.. మళ్లీ కాలు బయటపెడితే మాస్క్ లేకుండా వెళ్లరు అని ఆశిస్తోంది ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం.

Tags

Read MoreRead Less
Next Story