జూలై 16న రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

జూలై 16న రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను, ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను తొలగించడంతో ప్రస్తుతం మూడు శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శాఖలతో పాటు గతంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేసే పనిలో అశోక్ గెహ్లాట్ బిజీగా ఉన్నారు. జూలై 16 న మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ చేపట్టాలని గెహ్లాట్ భావిస్తున్నట్టు సమాచారం.

దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 15 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. సచిన్ పైలట్, విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాను తొలగించిన తరువాత మూడు శాఖలు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్‌లో మొత్తం 30 మంది మంత్రులను నియమించుకోవచ్చు. ముగ్గురు తొలగింపులు తరువాత ప్రస్తుతం మంత్రుల సంఖ్య 22గా ఉంది. అటువంటి పరిస్థితిలో, గెహ్లాట్ 8 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story