జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో కొత్త నిబంధన అమల్లోకి..

జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో కొత్త నిబంధన అమల్లోకి..

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక హైదరాబాద్‌లో ఈ కరోనా మహమ్మారి కరళా నృత్యం చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 8 మంది ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది.

అలాగే కరోనాని కట్టడి చేయడానికి జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. వైరస్‌ నియంత్రణ, హోం ఐసొలేషన్‌లో ఉంటోన్న వారికి వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది . ఇందులో భాగంగా కేసుల అధికంగా నమోదవుతోన్న ఎనిమిది సర్కిళ్లను హైరిస్క్‌ ఏరియాలుగా గుర్తించింది. ఆయా సర్కిళ్లకు నోడల్‌ ఆఫీసర్లను నియమించింది.

లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాంతాల వారీగా కట్టడి చేశారు. కేసుల సంఖ్యను బట్టి 100 నుంచి 200 మీటర్లు, అంతకంటే ఎక్కువ పరిధిని కట్టడి ప్రాంతంగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బస్తీలు, కాలనీలు కూడా గతంలో కట్టడి ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిన ఇంటినే కట్టడి చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో సత్ఫలితాలనివ్వలేదు. దీంతో కేసుల సంఖ్యను బట్టి కట్టడిని వీధి వరకు పెంచుతున్నారు. ఒక గల్లీలోని నాలుగైదు భవనాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైతే.. ఆ గల్లీలో రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story