పుస్తకాలు చూసి పరీక్షలు: ఢిల్లీ యూనిర్శిటీ

పుస్తకాలు చూసి పరీక్షలు: ఢిల్లీ యూనిర్శిటీ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం నిలిచిపోయింది. కొన్ని యూనివర్శిటీలు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని వర్శిటీలు విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ అందించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ ఇయర్ డిగ్రీ, పీజీ విద్యార్ధులకు పుస్తకాలు చూసి పరీక్షలు రాసే పద్దతిని ఢిల్లీ యూనివర్శిటీ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలు ఈనెల 17 నుంచి ప్రారంభమై వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇటీవల ఢిల్లీ హైకోర్టు చెప్పిన మేరకు కేవలం ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ విద్యార్ధులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు నిర్వహించే పరీక్షలకు హాజరు కాని విద్యార్ధులకు మరోసారి రాసే అవకాశం కల్పిస్తామని యూనివర్శిటీ తెలిపింది. త్వరలోనే ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఓపెన్ బుక్ పరీక్షలు జరగడానికి ముందు ఈనెల 31 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు తొలి దశ మాక్ టెస్ట్ లు నిర్వహంచాలని నిర్ణయించామని వర్శిటీ అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను జూలై 24న వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని వర్శిటీ అధికారులు తెలిపారు. రెండో దశ మాక్ టెస్టులు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story