అందర్నీ నవ్వించే అభిషేక్ 'మిస్ జానకి'..

అందర్నీ నవ్వించే అభిషేక్ మిస్ జానకి..

సాదా సీదాగా ఉంటారు.. మనమధ్యనే ఉంటారు. వారిలో ఏం టాలెంట్ ఉందో వారిక్కూడా తెలియదు.. అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది. చెన్నైకి చెందిన అభిషేక్ కి మెరుపులా వచ్చిన ఓ ఆలోచనే అతన్నో సెలబ్రెటీ చేసింది. వేలల్లో ఫాలోయర్స్ లక్షల్లో వ్యూస్ వచ్చేలా చేసింది. అతడికి వచ్చిన ఓ ఐడియానే 'మిస్ జానకి'. ఈ యానిమేషన్ ఎమోజీ సోషల్ మీడియాలో ఇప్పుడొక సంచలనం. ప్రతి ఇంటా నవ్వులు పూయించే ఈ ఎమోజీ మాట్లాడని టాపిక్ లేదు. ఒకటేమిటి అన్నీ.. పదవతరగతి పరీక్షల రద్దు.. చైనా ఉత్పత్తుల బ్యాన్ ఇలా ఎన్నో విషయాల మీద ఓ అరగంట నవ్వించేస్తాడు. యానిమేటెడ్ ఎమోజీతో పలు విషయాల మీద తన అభిప్రాయలను వెల్లడించాలనే సరికొత్త ఆలోచనకు రూపకల్పన చేశాడు లాక్ డౌన్ సమయంలో ఖాళీగా కూర్చోకుండా బుర్రకు పనిపెట్టిన అభిషేక్.

నా ఈ ఆలోచనకు ప్రేరణ మా కజిన్ అంటాడు. ఆమె ఫోన్ లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయని సంతోషంగా చెప్పింది. అందుకు నా రియాక్షన్ వినూత్నంగా ఉండాలనుకున్నా. అదే రోజు సాయింత్రం అమ్మ దగ్గర నుంచి గులాబీ రంగు సల్వార్ కమీజ్ తీసుకున్నాను. దానిపైన దుపట్టా వేసుకుని నా ముఖం బదులు మిస్ జానకి యానిమేషన్ ఎమోజీతో వీడియో పోస్ట్ చేశాను. అది వైరల్ అయింది. ఆ రోజు నుంచి వివిధ అంశాల మీద వీడియోలు చేయమంటూ వ్యూయర్స్ ప్రోత్సహించారు. మిస్ జానకి ఎక్కువగా ఇంగ్లీషులో, మధ్య మధ్యలో తమిళ పదాలు ఉపయోగిస్తూ అచ్చం టీచర్ల మాదిరి మాట్లాడేస్తుంది. ఇంతగా అందరూ ఆదరిస్తున్న మిస్ జానకితో పాటు మరో రెండు క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాడు అభిషేక్. టాలెంట్ ఉంటే ప్రోత్సాహం తప్పక లభిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ.

Tags

Read MoreRead Less
Next Story