ఆవు మూత్రంతో కరోనాను నిరోధించవచ్చు: బెంగాల్ బీజేపీ చీఫ్

ఆవు మూత్రంతో కరోనాను నిరోధించవచ్చు: బెంగాల్ బీజేపీ చీఫ్

పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవు మూత్రం తాగితే.. కరోనాను నిరోధించవచ్చని అన్నారు. కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఆవు మూత్రంలో ఉంటుందని అన్నారు. దుర్గాపూర్ నగరంలో జరిగిన సమావేశంలో దిలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. "ఆవులు గురించి నేను మాట్లాడితే.. చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ, ఆవు విలువ గాడిదకు తెలియదు. ఇది శ్రీకృష్ణుడు పుట్టిన నేల. ఇక్కడ మేము ఆవును పూజిస్తాం. ఆరోగ్యంగా ఉండడానికి ఆవు మూత్రం తాగుతాం. మద్యం తాగేవారు.. ఆవు గొప్ప తనాన్ని అర్థం చేసుకోలేరు" అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. అయితే, దిలీప్ కు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. గత సంవత్సరం ఆవు పాలులో బంగారం ఉంటుందని వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయ్యారు. ఈ ఏదాడి మేలో కూడా ఆవు మూత్రాన్ని తాగడం వలన ఎటువంటి హానీ లేదని అన్నారు. అయితే, దిలీప్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. సొంత పార్టీలో కూడా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆదారాలు లేవని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story