హార్డ్కోర్ట్ టోర్నమెంట్ ద్వారా ఆటలోకి సెరెనా విలియమ్స్

హార్డ్కోర్ట్ టోర్నమెంట్ ద్వారా ఆటలోకి సెరెనా విలియమ్స్

యుఎస్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వచ్చే నెలలో కెంటుకీలో జరగబోయే కొత్త హార్డ్కోర్ట్ టోర్నమెంట్ ద్వారా తిరిగి ఆటలోకి రానున్నారు. 23 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సెరెనా ఫిబ్రవరిలో జరిగిన ఫెడ్ కప్ తర్వాత ఏ టోర్నమెంట్‌లోనూ పోటీపడలేదు. ఉమెన్స్ అండ్ మెన్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్స్ ఆగస్టులో టోర్నమెంట్ ప్రారంభించాలనుకుంటున్నారు.

కెంటుకీలో జరిగే ఈ టోర్నమెంట్‌ను టాప్ సీడ్ ఓపెన్ అంటారు. ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో సెరెనా, 2017 యుఎస్ ఓపెన్ ఛాంపియన్ ఫ్లోయిన్ స్టీఫెన్స్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 31 నుంచి జరగబోయే తదుపరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యుఎస్ ఓపెన్‌లో పాల్గొంటానని సెరెనా ఇప్పటికే పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story