హైదరాబాద్ వాసులకు కరోనా దడ.. కొత్త హాట్‌స్పాట్‌

హైదరాబాద్ వాసులకు కరోనా దడ.. కొత్త హాట్‌స్పాట్‌

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్త హాట్‌స్పాట్‌ గా హైదరాబాద్ మారబోతోందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. మొదటి రెండు స్థానాల్లో బెంగళూరు, పూణె ఉంటే మూడో స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు పేర్కొంది. ఈ మూడు నగరాల్లో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి రేటు గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. గత నెల రోజుల కేసుల వివరాలను పరిశీలించిన మీదట దేశంలోని 9 పెద్ద నగరాల పరిస్థితిని అంచనా వేసింది. కేసుల వృద్ధిరేటు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నైలను దాటేసి హైదరాబాద్ రెండోస్థానానికి చేరిందని తెలిపింది. ఇక్కడ కేసుల పెరుగుదల రేటు 7.8 శాతంగా ఉందని చెప్పింది. అయితే కోవిడ్ మరణాల రేటులో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కొవిడ్ మరణాల రేటు 0.1శాతంగా ఉంటే, సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మరణాల రేటు 8.9గా నమోదవుతోంది. మరోవైపు క్వీన్ ఆఫ్ ది డెక్కన్ గా పేరొందిన మహారాష్ట్రలోని పుణెలో మరణాల రేటు 2.4 కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story