ఎంతకని చేస్తాం.. మేం కూడా మనుషులమే..

ఎంతకని చేస్తాం.. మేం కూడా మనుషులమే..

వైద్యులు దేవుళ్లు.. ప్రాణాపాయంలో ఉన్న రోగిని బతికిస్తే బంధువులు ఇచ్చే కితాబు.. అదే ఊపిరి ఆగిపోతే ఆ డాక్టర్ సకాలంలో వైద్యం అందించకే మృతి చెందాడు అని ఆస్పత్రిలో ఆందోళన. ఎవరికైనా బాధ అలానే ఉంటుంది. తన దగ్గరకి వచ్చిన పేషెంట్ కి మంచి వైద్యం అందించి అతడు కోలుకునేలా చేయాలని ప్రతి డాక్టరుకీ వుంటుంది. లేకపోతే డాక్టరు వృత్తికే కళంకం తెచ్చినవారవుతారు. కొన్ని కేసులు తమ చేయి దాటిపోతుంటాయి. తాజాగా నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి శనివారం ఉదయం కరోనా లక్షణాలతో మిర్యాలగూడ మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు తల్లి సాయంతో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు నమూనాలు తీసుకుని వార్డుకి పంపించారు. కొద్దిసేపటికి అతడు ఊపిరి అందక నరకయాతన అనుభవించాడు.

సాయింత్రం అయ్యేసరికి మరింత ఎక్కువవడంతో తల్లి కళ్లెదుటే కన్నుమూశాడు. కొడుకు మృతదేహం మీద పడి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. కొడుకును కోల్పోయిన బాధతో మీరే నాకొడుక్కి వైద్యం సరిగ్గా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ ని వివరణ కోరగా మేం ఎంతకని చేస్తాం, మేమూ మనుషులమే కదా అని సమాధానం చెప్పారు. కాగా ఆస్పత్రిలో తమకు చికిత్స అందడం లేదని రోగులు వాపోయారు. కాగా, మరో రోగి ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు చికిత్స సరిగా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకినట్లు మునిసిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 43,780కు చేరింది. వరంగల్ మేయర్ జి. ప్రకాశరావుకు ఆయన భార్యకు కరోనా సోకింది.

Tags

Read MoreRead Less
Next Story