డాక్టర్ ముజిబ్.. టెన్త్ క్లాస్

డాక్టర్ ముజిబ్.. టెన్త్ క్లాస్

శంకర్ దాదా ఎంబిబీఎస్ తరహాలో డాక్టర్ ముజిబ్ పదోతరగతి పాసై స్టెతస్కోప్ మెళ్లో వేసుకున్నాడు. పదేళ్లు కష్టపడితే కాని ఎంబిబీఎస్ పూర్తవదు. అంత ఓపిక లేదు.. పది పాసైతే చాలదా అని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ పెట్టాడు. పోలీసులకు పట్టుబడ్డాడు డాక్టర్ ముజీబ్ టెన్త్ క్లాస్. రోగుల నాడి పట్టుకుని జబ్బేదో చెప్పేస్తున్నాడు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మెహదీపట్నంలో విధులు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడింది. అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు ప్రైవేటు ఆస్పత్రిపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులు చేశారు. టెన్త్ చదివి డాక్టర్ గా చలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ ముజిబ్, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఫేక్ సర్టిఫికెట్స్ వారికి ఇచ్చింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story