ఒక్క కరోనా మరణం కూడా లేని రాష్ట్రాలు

ఒక్క కరోనా మరణం కూడా లేని రాష్ట్రాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం చేస్తుంది. భారత్ లో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. అత్యధిక కేసులు ఉన్నా దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, ప్రపంచదేశాలతో పోల్చుకుంటే.. భారత్ లో మరణాల రేటు చాలా తక్కవగా ఉంది. ప్రస్తుతం భారత్ లో సగటు మరణాల రేటు 2.49గా నమోదవుతుంది. భారత్ లో కరోనా మరణాల రేటు తగ్గుతూపోతుంది. జూన్ 2 నాటికి 2.82శాతంగా ఉండగా.. జూలై 10 నాటికి 2.72కి పడిపోయింది. అయితే, అది మరింత తక్కువగా నమోదవుతుంది. యెమెన్, బెల్జియం, యునైటెండ్ కింగ్‌డమ్‌లో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. దేశంలో మరణాలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా మరణాల నమోదుకాని దేశాలు కూడా ఉన్నాయి. మణిపూర్, నాగాలాండ్, సిక్కీం, మిజోరం, అండమాన్, నికోబార్ దీవుల్లో కరోనా కేసులు నమోదైనా.. మరణాలు మాత్రం లేవు.

Tags

Read MoreRead Less
Next Story