కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ప్రముఖ వైద్యులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో నివారణ చర్యలుపై చర్చించడానికి చంద్రబాబు చర్చించారు. ఈ సమయంలో ప్రజలందరికీ కరోనాపై అవగాహన అవసరమన్నారు. కరోనాపై పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. అదే సమయంలో కరోనాను నియంత్రించాలని చంద్రబాబు అన్నారు. గత రెండువారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా.. అటు, మరణాల్లో కూడా రెండవ స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రజలను కరోనా విషయంలో అవగాహన కల్పించి.. అప్రమత్తమయ్యేలా చేయడమే తప్ప.. మందులు లేవని అన్నారు. కరోనాపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఆస్పత్రుల్లోనూ సానిటైజేషన్ ఎంతో ముఖ్యమని, ఎక్కువ మంది రోగులను ఒకే అంబులెన్స్‌లో తీసుకురావటమూ వ్యాధి మరింత వ్యాధికి కారణం అవుతోందని తెలిపారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం అత్యవసర సేవ అందాల్సిన రోగులు వేచి చూడాల్సిరావటం తగదన్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు ఆగస్టు 15న చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఘనంగా నివాళులర్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story