కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడ్డ ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్ ప్రభుత్వంపై మండిపడ్డ ఢిల్లీ హైకోర్టు

కరోనా పరీక్షల నిర్వాహణ విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా రాపిడ్ టెస్టులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలని.. సొంత ప్రయోగాలు చేయోద్దని సూచించింది.

ఢిల్లీలో కరోనా వ్యాప్తిపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) ఓ సర్వే నిర్వహించిందని.. ఈ సర్వే ప్రకారం ఢిల్లీ 22.86 శాతానికి పైగా ప్రజలు కరోనా బారిన పడినట్లు హైకోర్టు ప్రస్తావించింది. అయితే చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వారికి తెలియడంలేదని అన్నారు. ఇలా క్లారటీ లేని సమయంలో రాపిడ్‌ పరీక్షలతో ఎలా చేస్తారని హైకోర్టు మండిపడింది. కేవలం కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే రాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేస్తోందని హైకోర్టు గుర్తు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story