కార్పోరేట్ ఆస్పత్రి ఝలక్ ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం

కర్నాటక ప్రభుత్వం ఓ కార్పోరేట్ ఆస్పత్రి ఝలక్ ఇచ్చింది. కరోనా రోగుల నుంచి అడ్వాన్సుల కింద తీసుకున్న రూ. 24.8 లక్షలను తిరిగిచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పంపించిన కరోనా రోగులకు ఉచితంగా వైద్యం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా.. కరోనా చికిత్సలపై ఆర్ ఆర్ నగర్ జోన్లోని ఆస్పత్రులను పర్యవేక్షిస్తున్న అధికారులు..హాస్పిటల్ బిల్లులను పరిశీలించగా కరోనా రోగులు నుంచి అడ్వాన్సులు వసూలు చేస్తున్నట్టు తెలింది. మొత్తం 22 మంది కరోనా రోగులనుంచి అడ్వాన్సులు వసూలు చేశారని.. దీంతో వారందరికీ రీఫండ్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story