అరుంధతీ రాయ్ ఉపన్యాసాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలి: బీజేపీ

అరుంధతీ రాయ్ ఉపన్యాసాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలి: బీజేపీ

కాలికట్ యూనివర్శిటీ బీఏ ఇంగ్లీష్‌‌లో రచయిత్రి అరుంధతీ రాయ్‌కు సంబంధించిన ఓ పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించాలని కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశాడు. ఈ పాఠ్యాంశం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన కేరళ గవర్నర్‌కు లేఖ రాశారు. ‘కమ్ సెప్టెంబర్’ శీర్షిక పేరిట 2002 లో వివాదాస్పద రచయిత్రి అరుంధతీ రాయ్ ఉపన్యసించారు. ఆ ఉపన్యాసాన్ని కాలికట్ యూనివర్శిటీ బీఏ ఇంగ్లీష్ సిలబస్‌లో చేర్చారు. ఆమె చేసిన ప్రసంగంలో కశ్మీర్ స్వాతంత్య్రం కోసం అహింసా పోరాటం అంటూనే బీభత్సం సృష్టించారనే వాఖ్యలు దేశ సమైక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. ఆమె అంతటితో ఆగకుండా ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకించిన ఎడిటర్లు మురుగన్ బాబు, అబిదా ఫరూకీల గురించి కూడా ఆమె ప్రసంగించారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story