ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

ఢిల్లీలో కొత్తగా 613 కరోనా కేసులు

ఢిల్లీలో కరోనా మహహ్మరి ప్రభావం రోజురోజుకు తగ్గుతుంది. గతంలో ప్రతీరోజు సుమారు 5వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ, ఇటీవల కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 613 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,31,219కి చేరిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. కాగా.. ఢిల్లీలో ఇంకా 10,994 మంది చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గి దేశంలో 10వ స్థానానికి చేరింది. కాగా.. కరోనా కట్టడిలో ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story